కొత్త వేరియంట్ ప్రభావం.. మహిళల వన్డే ప్రపంచకప్ రద్దు

సోమవారం, 29 నవంబరు 2021 (16:12 IST)
జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ కూడా కొత్త వేరియంట్ ప్రభావంతో నిలిచిపోయింది. కొత్త వేరియంట్ నేపథ్యంలో అనేక ఆఫ్రికా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధిస్తుండడంతో టోర్నీని నిలిపివేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. దీంతో శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ఐసీసీ పేర్కొంది.
 
ఆతిథ్య దేశం జింబాబ్వేలోనూ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో టోర్నీని కొనసాగించలేమని ఐసీసీ ఈవెంట్స్ విభాగం అధిపతి క్రిస్ టెట్లీ వెల్లడించారు. ఆయా దేశాలు చాలా తక్కువ వ్యవధిలో విమాన సర్వీసులు రద్దు చేశాయని, దాంతో వివిధ జట్లు వారి సొంత దేశాలకు వెళ్లడం కష్టసాధ్యంగా మారనుందని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు