ఐపీఎల్‌కు సౌతాఫ్రికా ఆటగాళ్ళు దూరం.. ఆ ప్రభావం ఏ జట్లపై పడుతుంది..

ఠాగూర్

బుధవారం, 14 మే 2025 (16:05 IST)
స్వదేశంలో ఐపీఎల్ పోటీలు మళ్లీ పునఃప్రారంభంకానున్నాయి. అయితే, ఈ టోర్నీలో పాల్గొంటూ వచ్చిన పలువురు విదేశీ క్రికెటర్లు భారత్ పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో స్వదేశాలకు వెళ్లిపోయారు. వీరిలో సౌతాఫ్రికా ఆటగాళ్ళు కూడా ఉన్నారు. అయితే, ఐపీఎల్ పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో సౌతాఫ్రికా ఆటగాళ్లు మాత్రం పూర్తిగా ఇకపై జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోతున్నారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ నేపథ్యంలో తమ ఆటగాళ్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడే అవకాశాలు లేవని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు చెబుతోంది. 
 
మా ప్రథమ ప్రాధాన్యం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం. అందుకే టెస్ట్ జట్టులో భాగమయ్యే మా ఆటగాళ్ళు మే 26వ తేదీన ఖచ్చితంగా తిరిగి రావాలని అనుకుంటున్నాం. బీసీసీఐని కూడా మేం ఇదే కోరుతున్నాం" అని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఈనాక్ నిక్వే అంటున్నారు. 
 
కాగా, ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లకు దూరమయ్యే ఆటగాళ్ళ జాబితాలో కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్), లుంగి ఎంగిడి (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), ఐదెన్ మార్‌క్రమ్ (లక్నో సూపర్ జెయింట్స్), ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్), మార్కో యాన్సెన్ (పంజాబ్ కింగ్స్), వియాన్ ముల్డర్ (సన్ రైజర్స్ హైదరాబాద్)లు ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు