ఇదే అంశంపై యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, 'గతంలో నేను ఓ సినీ నటితో డేటింగ్ చేశా. ఆమె షూటింగ్ కోసం అడిలైడ్‌లో వచ్చింది. మేం కాన్‌బెర్రాలో ఉన్నాం. 'ఆటపై దృష్టి పెట్టాలి. నువ్వు ఇక్కడకు రావద్దు'అని చెప్పా. నేను చెప్పినా వినకుండా ఆమె కాన్‌బెర్రాకు వచ్చేసింది. 'ఆమెను చూసి ఇక్కడేం చేస్తున్నావు?' అని అడిగా. 'నీతో సమయం గడుపుదామని వచ్చానని చెప్పింది. దీంతో ఆ రోజు ఆమెతోనే ఉండిపోయాన'ని యువీ తెలిపాడు.
కానీ, ఎలాగో వారి కంట పడడంతో.. చప్పట్లు కొడుతూ ఆటపట్టించారు. అయితే, ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం యువీ బయటపెట్టలేదు. ఆ హీరోయిన్ బాలీవుడ్ నటి దీపికా పదుకొనేనే అంటూ జాతీయ మీడియాలో ప్రచారం సాగుతుంది.