ధనశ్రీతో చహల్ విడాకులు అంటూ ప్రచారం.. ఫుల్‌స్టాఫ్ పెట్టాలంటూ వినతి

శుక్రవారం, 19 ఆగస్టు 2022 (14:21 IST)
భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ తన భార్య ధనశ్రీకి విడాకులు ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనిపై ఆయన స్పందించారు. అవన్నీ పుకార్లేనని చెప్పారు. పైగా, ఈ వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు. పైగా, ఈ ప్రచారానికి ఇంతటితో ముగింపు పలకాలని ఆయన ప్రాధేయపడ్డాడు.
 
అయితే, వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ సాగిన ప్రచారానికి కారణం కూడా వారిద్దరే కావడం గమనార్హం. యజువేంద్ర చహల్, ధనశ్రీ దంపతులు తమతమ సోషల్ మీడియాల్లో చేసిన పోస్టులో కారణంగా నిలిచాయి. కొత్త జీవితం ప్రారంభంకానుందంటూ చహల్ పోస్ట్ చేయగా, తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను చహల్ పేరును ధనశ్రీ తొలగించారు. దీంతో సోషల్ మీడియా పుకార్లకు మరింతగా అవకాశం ఇచ్చారు. పైగా, తన పేరును ధనశ్రీ వర్మగా ఆమె మార్చుకున్నారు. 
 
ఈ వార్తలపై చహల్ స్పందించారు. తమ వైవాహిక బంధంపై వస్తున్నవన్నీ పుకార్లేనని, దయచేసి వాటిని ఎవరూ నమ్మవద్దని కోరారు. వాటికి ఇంతటితో ముగింపు పలకాలని కోరారు. ప్రతి ఒక్కరి జీవితం ప్రేమతో వెలిగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు చహల్ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
కాగా, గత 2020లో దంత వైద్యురాలైన ధనశ్రీని చహల్ వివాహం చేసుకున్నాడు. ధనశ్రీ డెంటిస్ట్ మాత్రమే కాదు. ఒక యూట్యూబర్ కూడా. పెళ్లికి ముందు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ వేదికగా ఈ జంట చేసిన అల్లరి అంతాఇంతా కాదు. అనేక వీడియోలు, పోస్టులు చేసి అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు