అంతర్జాతీయ పోటీలకు నేను ఫిట్: అక్తర్

అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు అవసరమైన ఫిట్‌నెస్ సాధించినట్టు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తెలిపారు. త్వరలో తటస్థ వేదిక అబుదాబిలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు ఫిట్‌నెస్‌గా ఉన్నట్టు ప్రకటించాడు. 33 సంవత్సరాల షోయబ్ కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని మంగళవారం అక్తర్ వెల్లడించారు.

కాగా, పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఏప్రిల్ 22 నుంచి మే ఏడో తేదీల మధ్య అబుదాబి, దుబాయ్‌లో జరుగనున్నాయి. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాను. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో దేశ జాతీయ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించేందుకు ఉవ్విళ్ళూరుతున్నట్టు షోయబ్ వెల్లడించాడు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఫాస్ట్‌బౌలర్‌లలో ఒకడిగా పేరుగాంచిన అక్తర్.. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ అనంతరం జట్టు నుంచి ఉద్వాసన పలికారు.

ఆ తర్వాత జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా అక్తర్‌కు చోటు దక్కలేదు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు తాను జట్టులోకి రావాలని జట్టు కోచ్ యూనిస్ ఖాన్, కోచ్ ఇంతికాబ్ ఆలమ్‌లు కోరుకుంటున్నారని చెప్పాడు. తన ఆశలు కెప్టెన్, కోచ్, జాతీయ సెలక్టర్లపై ఆధారపడి ఉన్నట్టు చెప్పాడు. ఈ పర్యటనలో పాక్ జట్టు ఆస్ట్రేలియాతో ఐదు వన్డే‌లు ఒక ట్వంటీ-20 మ్యాచ్‌‌ను ఆడుతుంది. ఈ పర్యటన కోసం జట్టును వచ్చే నెలలో ప్రకటిస్తారు.

వెబ్దునియా పై చదవండి