ఆఖరి వన్డేను బాయ్‌కట్ చేయనున్న విండీస్

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆఖరి (ఐదో) వన్డేను బాయ్‌కట్ చేయాలని వెస్టిండీస్ భావిస్తున్నారు. ఈ మేరకు జట్టు ఆటగాళ్లు హెచ్చరికలు చేశారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభించని పక్షంలో ఐదో వన్డేను బాయ్‌కట్ చేయాలని విండీస్ ఆటగాళ్లు భావించారు. అయితే, కెప్టెన్ క్రిస్ గేల్ మాత్రం ఈ ఊహాగానాలను తోసిపుచ్చారు.

క్రికెట్ బోర్డుతో జరిగిన చర్చలు సఫలీకృతం కాకపోవడంతో ఆటగాళ్లు నిరుత్సాహానికి లోనైన మాట వాస్తవమేనని, దీంతో ఏప్రిల్ మూడో తేదీన సెయింట్ లూసియాలో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కట్ చేయాలని ఆటగాళ్లు తొలుత నిర్ణయించినట్టు రెండు రోజుల క్రితం గేల్ చెప్పడం గమనార్హం. అయితే, గురువారు జరిగే మ్యాచ్‌ను బాయ్‌కట్ చేయడం లేదని తాజాగా అంటున్నాడు. కాగా, విండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో వన్డే ఆదివారం జరుగనుంది.

వెబ్దునియా పై చదవండి