ఐపీఎల్‌లో ఎంతకాలం కొనసాగుతానో చెప్పలేను: ద్రవిడ్

FILE
అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పిన తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం ఆడుతానని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. అయితే ఎంతకాలం ఐపీఎల్‌లో కొనసాగుతానో చెప్పడం కష్టమని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకున్నానని ద్రవిడ్ స్పష్టం చేశాడు.

కెరీర్‌కు గుడ్‌బై చెప్పడంపై పశ్చాత్తాప పడే ప్రసక్తే లేదన్నారు. భవిష్యత్తు గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ద్రవిడ్ తెలిపాడు. కొంతకాలం కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటానని, ఆతర్వాత తీరిగ్గా ఏం చేయాలో నిర్ణయించుకుంటానని అన్నాడు. క్రికెట్‌ను విడిచిపెట్టిన తర్వాత ఇతరత్రా పనుల్లో నిమగ్నంకావడానికి కొంత సమయం పడుతుందని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి