ఐపీఎల్ ప్రసార హక్కులు 8200కోట్లుకు ఖరారు

ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసార హక్కులను మల్టీ స్క్రీన్ మీడియా(గతంలో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ), వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్‌లు చేజిక్కించుకున్నాయి. ఈ ఒప్పందం రానున్న తొమ్మిది సంవత్సరాలవరకు ఉంటుందని, దీనికిగాను 8200 కోట్లు ఖరారు చేసినట్లు డీఎల్‌ఎఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారికంగా ప్రకటించింది.

దక్షిణ ఆఫ్రికాలో 18వ తేదీనుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ రెండవ భాగంలో 59 మ్యాచ్‌లు జరుగనున్నాయి. దీనికి సంబంధించి ఎమ్ఎస్ఎమ్‌కు భారతదేశంలో ఎక్స్‌క్లూజివ్ ఆడియో విజువల్ అధికారాలు ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం జరిగిన ఒప్పందంలో భాగంగా ఎమ్ఎస్ఎమ్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేయడానికి అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు ఐపీఎల్‌కు చెందిన లలిత్ మోడీ వ్యాఖ్యానించారు. డబ్ల్యూఎస్‌జీ, మల్టీ స్క్రీన్ మీడియాతో చేసుకున్న ఒప్పందంతో తాము సంతోషంగా ఉన్నామని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి