ఐపీఎల్ ప్రసార హక్కుల వివాదం: సోనీకి నిరాశ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు బాంబే హైకోర్టు సోమవారం నికారించింది. ఐపీఎల్ ప్రసార హక్కులపై బీసీసీఐ, సోనీ టెలివిజన్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ సోనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అయితే సోనీ కోరికను కోర్టు సోమవారం విచారణ సందర్భంగా తోసిపుచ్చింది.

సోనీతో గత ఏడాది కుదుర్చుకున్న ఐపీఎల్ ప్రసార హక్కుల కాంట్రాక్టును బీసీసీఐ గత వారం రద్దు చేసుకుంది. ప్రారంభ ఐపీఎల్ టోర్నీ ప్రసార హక్కులను సోనీ కైవసం చేసుకుంది. అయితే ఐపీఎల్ రెండో సీజన్ ప్రసార హక్కులను మాత్రం వరల్డ్ స్పోర్ట్స్ గ్రూపుకు (డబ్ల్యూఎస్‌జీ)కి అప్పగిస్తూ బీసీసీఐ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై తమ కాంట్రాక్టును రద్దు చేయడం అక్రమమంటూ సోనీ కోర్టుకు వెళ్లింది.

వెబ్దునియా పై చదవండి