ఐపీఎల్-3: డీసీ-ముంబైల మధ్య కీలక మ్యాచ్ నేడే..!!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా శనివారం డెక్కన్ ఛార్జర్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. కాగా.. వరుస పరాజయాలతో తల్లడిల్లిపోతున్న డీసీ జట్టు.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అత్యంత పటిష్టవంతంగా ఉన్న ముంబయి ఇండియన్స్‌ను ఓడించాలంటే గట్టి పోరాటమే చేయాల్సి ఉంది.

ఐపీఎల్-2 సీజన్‌లో ఒంటిచేత్తో జట్టుకు ట్రోఫీని సాధించిపెట్టిన డెక్కన్ చార్జర్స్ కెప్టెన్ గిల్‌క్రిస్ట్ ఈసారి ఓ మేరకు రాణిస్తుండటం ఆ జట్టును కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక డీసీ జట్టులోని గిబ్స్, సైమండ్స్‌లు ఓ మేరకు మంచి ఆటతీరునే కనబరుస్తున్నా.. జట్టును మాత్రం విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోతున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేజేతులా ఓటమిపాలైన డీసీకి అన్ని రంగాల్లోనూ పటిష్టవంతంగా దూసుకెళ్తున్న సచిన్ సేనతో ఆడనున్న ఈ మ్యాచ్ అంత సులువుగా ఏమీ ఉండదు.

మరోవైపు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రాయుడు, తివారీ, పొలార్డ్, బ్రేవో తదితర ఆటగాళ్లతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో అత్యంత పటిష్టవంతంగా ఉన్న ముంబయి ఇండియన్స్ విజయమే లక్ష్యంగా బరిలో దిగనుంది. అయితే తొలి లీగ్ మ్యాచ్‌లోనే పరాజయంపాలైన డీసీ జట్టు ఈసారి మాత్రం ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లను మెరుగుపరచుకుని ఉత్తమమైన ఆటతీరును ప్రదర్శిస్తేనే డీసీకి గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే డీసీ ఎత్తులను వరుస విజయాలతో దూసుకెళ్తున్న ముంబయి ఇండియన్స్ పారనిస్తారా..? లేదో వేచిచూడాల్సిందే మరి..!!

వెబ్దునియా పై చదవండి