ఐపీఎల్-3 ఫైనల్‌కు పూర్తి ఫిట్‌నెస్‌తో పోలార్డ్ రె "ఢీ"!
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ ఫైనల్ పోరుకు ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు, ఆల్‌రౌండర్ పోలార్డ్ పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగనున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ఫైనల్లో ఆడుతాడా? లేదా? అనే విషయంపై సంశయం నెలకొన్న నేపథ్యంలో.. పోలార్డ్ పూర్తి ఫిట్‌నెస్‌తో క్రీజులోకి దిగడం సచిన్ సేనకు అదనపు బలం చేకూరినట్లేనని జట్టు యాజమాన్యం భావిస్తోంది.
ఇంకా ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ చేతి వేలికి గాయం తగలడంతో... నిరాశకు గురైన క్రికెట్ అభిమానులకు.. పోలార్డ్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఆడతాడనే వార్త ఎంతో ఉత్సాహాన్నిస్తుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేతికి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైనల్ పోరుకు సచిన్ అందుబాటులో ఉండడని వార్తలొచ్చాయి. కానీ చేతికి గాయం తగిలినా.. ఫైనల్లో ముంబై తరపున ఆడతానని సచిన్ స్పష్టం చేశాడు.
అయితే గాయం కారణంగా సచిన్ కెప్టెన్సీ సారథ్యం మాత్రమే వహించగలడని, బ్యాటింగ్‌లో రాణించడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలార్డ్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఆడటం జట్టును కొంతవరకు ఆదుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇంకా పొలార్డ్ ఫిట్‌గా ఉన్నాడని, క్రీజులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అభిమానులను, ప్రేక్షకులకు ఆకట్టుకుంటాడని జట్టు యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే.. బెంగళూరుతో జరిగిన తొలి సెమీఫైనల్లో పోలార్డ్ ధీటుగా రాణించిన సంగతి తెలిసిందే. కేవలం 13 బంతుల్లో ఈ ట్రినిడాడ్ ఆల్‌రౌండర్ 33 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఇంకా సెమీస్ తొలి మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ఏకంగా మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్ 35 పరుగుల తేడాతో బెంగళూరుపై విజయం సాధించడంలో పోలార్డ్ కీలక పాత్ర పోషించాడు.