ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ జట్టు ప్రకటన!

FILE
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో వెస్టిండీస్‌లో జరిగే ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడే ఇంగ్లండ్ జట్టులో హేమ్స్‌వర్త్‌ క్రికెటర్ డేవిడ్ వైన్‌రైట్‌కు స్థానం దక్కలేదు. కరేబియన్ గడ్డపై ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరిమిత ట్వంటీ-20 వరల్డ్‌కప్‌లో ఆడే ఇంగ్లాండ్ జట్టును గురువారం ప్రకటించారు.

ఇందులో మైఖేల్ లంప్, రవి బొపరాలకు స్థానం దక్కింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున లంప్ ఆడుతుండగా, రవి బొపరా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇంకా ఓపెనర్ క్రికెట్ స్టార్ కెస్వెట్టర్‌ కూడా ఇంగ్లాండ్ ట్వంటీ-20 జట్టులో స్థానం దక్కింది. కానీ హేమ్స్ వర్త్ క్రికెటర్ డేవిడ్ వైన్‌రైట్‌కు మాత్రం సెలక్టర్లు జట్టులో స్థానం కల్పించలేదు.

ఇంగ్లాండ్ జట్టు వివరాలు: పాల్ కాలింగ్‌వుడ్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, రవి బొపరా, టిమ్ బ్రెస్నాన్, స్టువర్ట్ బ్రాడ్, క్రెగ్ కెస్వెట్టర్, మైఖేల్ లంప్, ఇయోన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్, అజ్మల్ షాజాద్, రియాన్ సైడ్‌బాటమ్, గ్రేమ్ స్వాన్, జేమ్స్ ట్రెడ్‌వెల్, లూక్ రైట్, మైఖేల్ యార్డీ.

వెబ్దునియా పై చదవండి