చిన్నస్వామి స్టేడియంలో పేలుడు: ఇద్దరికి గాయాలు

PTI
బెంగళూరులో ఎమ్. చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో శనివారం పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఓ పోలీసుతో సహా ఇద్దరు గాయాలకు గురైయ్యారు. కానీ ఈ పేలుడుకు అనంతరం పరిస్థితి సద్దుమణగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్‌ల మధ్య 52వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ ప్రారంభమైంది.

స్టేడియంకు 11వ గేట్ వద్ద జరిగిన ఈ పేలుడులో ఓ పోలీస్‌తో పాటు ప్రైవేట్ భద్రతా అధికారి కూడా గాయాలకు గురైనట్లు తెలిసింది. ఈ పేలుడులో గాయానికి గురైన ఇద్దరిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.

చిన్నస్వామి స్టేడియంలోని జనరేటర్ గదిలో ఈ పేలుడు చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మ్యాచ్ ప్రారంభమయ్యేందుకు ఒక గంట ముందు ఈ పేలుడు సంభవించింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అనంతరం టాస్ గెలిచిన ఛాలెంజర్స్ కెప్టెన్ కుంబ్లే ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

వెబ్దునియా పై చదవండి