బీహార్ రాష్ట్రంలోని సుపాల్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడుని పట్టుకుని చితకబాది, బలవంతపు పెళ్లి చేశారు. అడ్డొచ్చిన యువకుడి తల్లిదండ్రులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
రాష్ట్రంలోని జీవచ్ఛాపూర్‌కు చెందిన మిథిలేశ్ కుమార్ ముఖియా (24)కు తన మేనమామ శివచంద్ర ముఖియా భార్య రీటా దేవితో అక్రమ సంబంధం ఉందని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మిథిలేశ్‌ను కిడ్నాప్ చేసి శివచంద్ర ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ శివచంద్రతో పాటు మరికొందరు గ్రామస్థుల కలిసి మిథిలేశ్‌పై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ తర్వాత రీటా దేవిని కూడా అక్కడకి తీసుకొచ్చి కొట్టారు. ఆ తర్వాత మిథిలేశ్‌తో ఆమెకు బలవంతంగా తాళి కట్టించి, పాపిటలో సింధూరం పెట్టించి పెళ్లి చేశారు. అడ్డుకోబోయిన తమపైనా దాడి చేశారని మిథిలేశ్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ దాడిలో మిథిలేశ్ వీపు, మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి ఘటనపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకోగానే గ్రామస్థులంతా పారిపోయారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు శివచంద్ర ముఖియతో పాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు.