చైనాలో క్రికెట్‌‌ వృద్ధిపై మియాందాద్ నివేదిక

బుధవారం, 25 మార్చి 2009 (12:51 IST)
చైనాలో క్రికెట్‌ను వృద్ధి చేసేందుకు మాజీ పాక్ కెప్టెన్ జావేద్ మియాందాద్ తయారు చేసిన ఓ నివేదికను పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి అందజేశారు. చైనాలో పింగ్‌పాంగ్‌లో క్రికెట్‌ను ఎలా వృద్ధి చెయ్యవచ్చు అనే విషయాన్ని కూడా ఈ నివేదికలో మియాందాద్ పేర్కొన్నట్లు తెలిసింది.

కరాచీలో విలేకరులతో మియాందాద్ మాట్లాడుతూ, ఇటీవల తాను చైనా పర్యటనకు వెళ్లినప్పుడు ప్రత్యేకించి యూనివర్శిటీ విద్యార్థుల్లో క్రికెట్ పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తున్న విషయాన్ని తాము పరిశీలించామన్నారు. ప్రభుత్వంలోని క్రీడా విభాగ అధికారులను కలిసినపుడు క్రికెట్ పట్ల వారు చూపించిన శ్రద్ధ ఎనలేనిదని ప్రశంసించారు.

క్రికెట్ పరంగా చైనాకు ఏ విధంగా సాయం చేయవచ్చే తన పర్యటన వివరాలను చూస్తే అర్థమవుతుందన్నారు. అయితే ఈ సాయం అందినట్లయితే వర్ధమాన క్రికెట్ దేశంగా చైనా అందరి మన్ననలు పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అదలా ఉంచితే రానున్న రోజుల్లో క్రికెట్‌కు అతి పెద్ద మార్కెట్‌గా ఎదుగుతోందనే ఉద్దేశ్యంతో అనేక ఇతర దేశాలు ఇప్పటికే చైనాపై దృష్టి సారించాయి.

వెబ్దునియా పై చదవండి