జట్టుకి ప్రమాదికారినట.. అందుకే "గుడ్ బై": యూసుఫ్

మాజీ పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు గుడ్ బై చెప్పాడు. యూసుఫ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా అతనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

తన రిటర్మైంట్ గురించి యూసుఫ్ మాట్లాడుతూ..." నేను జట్టుతో ఉండటం వల్ల జట్టుకు హానికరమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి నాకు ఉత్తరం అందింది. అందువల్ల నేను అంతర్జాతీయ క్రికెట్ పోటీల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా నా అభిమానులందరికీ ధన్యవాదాలు. నా 12 ఏళ్ల కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబానికీ, నా సీనియర్ ఆటగాళ్లకి అందరికీ కృతజ్ఞతలు"

నిజానికి తను ఎప్పుడూ దేశంకోసమే ఆడాననీ, అటువంటిది జట్టులో తను ఉండటం వల్ల జట్టుకు హాని జరుగుతుందని పీసీబి భావించినప్పుడు ఇక అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనకూడదని తను నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. కాగా పదవీ విరమణ తప్పదన్న వార్తలు రావడంతో గతవారం నుంచే యూసుఫ్ మానసికంగా సిద్ధమయ్యాడు.

పాక్ క్రికెట్ జట్టులో మేటి బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న యూసుఫ్ ఇప్పటివరకూ 88 టెస్ట్ మ్యాచ్‌లు, 282 ఒకరోజు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా 9 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించిన యూసుఫ్ టెస్ట్ క్రికెట్లో 7, 431 పరుగులు చేశాడు. ఇక ఒన్డేల్లో అయితే 10వేల పరుగులకు చేరువయ్యాడు.

వెబ్దునియా పై చదవండి