తప్ప తాగి బండి నడిపిన బౌలర్ గ్రేమ్ స్వాన్ అరెస్టు!

FILE
ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్నర్ వివాదంలో చిక్కుకున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున తప్ప తాగి బండి నడపడంతో గ్రేమ్ స్వాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని నాటింగ్‌అంప్‌షైర్ కౌంటీ క్లబ్‌ శనివారం వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో గత నెలలో జరిగిన టెస్టు సిరీస్‌‌లో ఇంగ్లండ్ 2-0తో నెగ్గిన సంగతి తెలిసిందే.

ఈ టెస్టు మ్యాచ్‌ల్లో అద్భుతమైన బౌలింగ్‌తో రాణించిన గ్రేమ్ స్వాన్, ప్రపంచంలో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా నిలివడం గమనార్హం.

నాటింగ్‌అంప్‌‌షైర్, పశ్చిమ బ్రిడ్‌ఫోర్డ్ ప్రాంతంలో డ్రింక్ చేసి బండిని నడపడంతో గ్రేమ్ స్వాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 31 ఏళ్ల గ్రేమ్ స్వాన్‌ను శుక్రవారం తెల్లవారు జామున తాగి బండిని నడిపాడని బిరోన్ రోడ్డు వద్ద 3.23 ప్రాంతంలో స్వాన్‌ను అరెస్టు చేశామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి