నేపియర్‌లో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. తొలి రోజు నాలుగు వికెట్ల నష్టానికి 351 పరుగులతో రెండో రోజు ఉదయం ఆటను కొనసాగించిన కివీస్ జట్టు తొలి రోజు జోరును ఏమాత్రం తగ్గించలేదు. ఫలితంగా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రైడర్ కెరీర్‌లో తొలిడబుల్ సెంచరీ నమోదు చేసుకోగా, వికెట్ కీపర్ బ్రెండెన్ మెక్‌కల్లమ్ సెంచరీ చేశాడు. అలాగే కెప్టెన్ వెటోరి అర్థ సెంచరీతో రాణించాడు. దీంతో కివీస్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 600 పరుగుల పైచిలుకు భారీ స్కోరు చేసింది.
ఇప్పటివరకు భారత బౌలర్లలో జహీర్ మూడు, శర్మ రెండు, హర్భజన్ సింగ్ ఒక వికెట్ తీశారు. బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా ఉండటంతో జట్టు బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్లు లభించడం గగనంగా మారింది. కాగా, తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినప్పటికీ మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అద్భుతంగా రాణించడంతో జట్టు కోలుకుంది.
ఒక దేశలో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును టేలర్ (151), రైడర్ (201), ఫ్రాంక్లిన్ (52), మెక్ కల్లమ్ (115), వెటోరి (55)లు రాణించడంతో కివీస్ జట్టు కోలుకుంది. కాగా, మూడు టెస్ట్‌ల సిరీస్‌లో కివీస్ జట్టు 1-0 తేడాతో వెనుకబడివున్న విషయం తెల్సిందే.