ప్లడ్‌లైట్ల కింద మ్యాచ్‌లు నిర్వహించకండి..!: పీసీబీ

FILE
దేశానికి చెందిన ఉన్నత విద్యుత్ సరఫరా సంస్థలు రాత్రిపూట ప్లడ్‌లైట్ల కింద జరగాల్సిన మ్యాచ్‌లను నిర్వహించవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో పాటు ఆ దేశ క్రీడా సమాఖ్యలు పేర్కొన్నాయి. విద్యుత్ ఆదాలో భాగంగా.. పాకిస్థాన్‌లో ప్లడ్‌లైట్ల కింద జరిగే మ్యాచ్‌లను తమ ఆధ్వర్యంలో నిర్వహించడాన్ని దేశంలోని భారీ విద్యుత్ సరఫరా సంస్థలు ఆపివేయాలని పీసీబీ సూచించింది.

ఇప్పటికే ఈ విషయాన్ని పాక్‌కు చెందిన పలు విద్యుత్ సంస్థలకు, పీసీబీ, ఇతరత్రా క్రీడా సమాఖ్యలకు తెలియజేసినట్లు పాకిస్థాన్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ఛైర్మన్ ముహమ్మద్ ఖలీద్ విలేకరులతో చెప్పారు.

పాకిస్థాన్‌ విద్యుత్ కొరతతో సతమతమవుతుందని ఖలీద్ వెల్లడించారు. అందుకే ప్లడ్‌లైట్ల కింద జరిగే మ్యాచ్‌లు, ఈవెంట్లను నిర్వహించడాన్ని ఆపివేయాల్సిందిగా కోరినట్లు ఆయన చెప్పారు.

ఇకపోతే.. పాకిస్థాన్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ఛైర్మన్ ముహమ్మద్ ఖలీద్ సూచన మేరకు ప్లడ్‌లైట్ల కింద నిర్వహించే మ్యాచ్‌లను ఆపివేయాలని సంబంధిత విద్యుత్ కంపెనీలకు పీసీబీ సమాచారం అందవేసింది.

వెబ్దునియా పై చదవండి