కోల్‌కతా నైట్‌రైడర్స్ మేనేజర్ జాన్ బుచానన్ జట్టు పూర్తిస్థాయి కెప్టెన్సీకి బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీని దూరం చేశారు. ఐపీఎల్ రెండో సీజన్‌లో జట్టుకు ఏ ఒక్క ఆటగాడో కెప్టెన్‌గా ఉండరని ప్రకటించారు. ఈ ప్రకటనపై క్రికెట్ వర్గాల్లో మిశ్రమ స్పందనలు వస్తున్న నేపథ్యంలో గురువారం నైట్‌రైడర్ జట్టు యజమాని షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. తమ జట్టులో టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రధాన ఆటగాడని చెప్పారు.
జట్టు కెప్టెన్‌గా గంగూలీకి షారుఖ్ ఈ సందర్భంగా మద్దతిచ్చాడు. తమ జట్టులో గంగూలీ ఇప్పటికే ప్రధాన ఆటగాడు. ఆయన వద్ద నుంచి కెప్టెన్సీని ఎవరూ దూరం చేయలేదన్నారు.
ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‌తో షారుఖ్ మాట్లాడుతూ.. గంగూలీ ప్రమేయంతోనే అన్ని నిర్ణయాలు తీసుకోబడతాయని తెలిపారు. అంతకుముందు బుచానన్ జట్టుకు నాలుగురైదుగురు ఆటగాళ్లు కెప్టెన్‌గా ఉంటారని చేసిన ప్రకటన మిశ్రమ స్పందనలకు దారితీసింది.