మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీపై బోలింగర్ ప్రశంసల వర్షం!

PTI
చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీపై ఆస్ట్రేలియా క్రికెటర్ బోలింగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. హైదరాబాదీ ఫ్రాంచైజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్‌ను మట్టికరిపించి, ఫైనల్లోకి దూసుకెళ్లడంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సమర్థవంతంగా నడిపిన ధోనీ నాయకత్వ తీరు భేష్ అని బోలింగర్ కొనియాడాడు.

అత్యుత్తమ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ.. అటు క్రికెటర్‌గానూ.. ఇటు జట్టు సారథిగానూ రాణిస్తున్నాడని ప్రశంసించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ధోనీ తన సత్తాను నిరూపించుకున్నాడని బోలింగర్ కితాబిచ్చాడు.

ఐపీఎల్ ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ జట్టుతో పోటీ పడేందుకు తమ జట్టు సంసిద్ధంగా ఉందని బోలింగ్ చెప్పాడు. అయితే ఐపీఎల్‌లో తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించిన ముంబై ఇండియన్స్‌ జట్టులోనూ సచిన్ టెండూల్కర్, పోలార్డ్ వంటి మేటి క్రీడాకారులున్నారని బోలింగర్ ఎత్తి చూపాడు.

కానీ తమ జట్టు ముంబైపై నెగ్గేందుకు ధీటుగా రాణిస్తుందని, టైటిల్‌ను నెగ్గే దిశగా తీవ్రంగా కృషి చేస్తుందని బోలింగర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి