దక్షిణాఫ్రికా పేసర్ ఆండ్రూ నెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు తాను స్వస్తి పలుకుతున్నట్లు బుధవారం నెల్ ప్రకటించాడు. ఎనిమిదేళ్లుగా తన దేశం కోసం ఆడానని, తన కల నెరవేరిందని నెల్ అన్నాడు.
ఇన్నాళ్లు తనకు జట్టు తరపున సహకరించిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ గ్రేమ్‌స్మిత్, కోచ్ మిక్కీ ఆర్థూర్, విన్నీ బార్నెస్, తన టీం సభ్యులు, అభిమానులకు ఈ సందర్భంగా నెల్ కృతజ్ఞతలు తెలియజేశాడు. జట్టు సభ్యులతో కలిసి ఆడిన జ్ఞాపకాలను ఎన్నడూ మరిచిపోలేని వని నెల్ అన్నాడు. రానున్న మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా జట్టు ప్రత్యర్థులపై ధీటుగా రాణించాలని నెల్ ఆకాంక్షించాడు.
ఇదిలా ఉండగా... 2001లో తొలిసారి దక్షిణాఫ్రికా వన్డే జట్టులోకి అడుగుపెట్టిన నెల్ 4 నెలల తర్వాత టెస్టు జట్టులోనూ స్థానం సంపాదించాడు. 8 ఏళ్ల కెరీర్‌లో 36 టెస్టులు ఆడి 31.86 సగటుతో 123 వికెట్లు సాధించాడు. 79 వన్డేల్లో 27.68 సగటుచో 106 వికెట్లు పడగొట్టాడు.