అలాంటి పరిస్థితుల్లో శతకం సాధించడం నా అదృష్టం: వార్నర్

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన 26వ లీగ్ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం తన అదృష్టమని స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఢిల్లీ సోమవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 40 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయభేరి మోగించింది.

మ్యాచ్‌కు 18వ ఓవర్ వద్ద మురళీ కార్తీక్ బౌలింగ్‌లో ఆడుతున్న డేవిడ్ వార్నర్ 96 పరుగుల అవుట్ కావాల్సింది. కానీ టీవీ అంపైరింగ్ ద్వారా డేవిడ్ వార్నర్ నాటౌట్ అని తేలడంతో డేవిడ్ వార్నర్ ఓ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

మురళీ కార్తీక్ బంతిలో ఆడుతున్న తాను 96 పరుగుల వద్దే పెవిలియన్ చేరుకుంటానని భావించాను. కానీ టీవీ అంపైరింగ్ ద్వారా నాటౌట్ అని తేలడం అదృష్టకరమని డేవిడ్ వార్నర్ అన్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సెంచరీని నమోదు చేసుకోవడం నిజంగానే తన అదృష్టమేనని డేవిడ్ వార్నర్ వెల్లడించాడు.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్‌ వార్నర్‌ (69 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్; 107 పరుగులు‌) సూపర్‌ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా డేవిడ్ వార్నర్‌తో పాటు కాలింగ్‌వుడ్‌ (53: 45 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ గెలుపును నమోదు చేసుకుంది.

మరోవైపు.. డేవిడ్ వార్నర్ సెంచరీ సాధించడంపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయానికి కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్ ఆటతీరు భేష్ అని గంభీర్ కొనియాడాడు. ఇంకా వార్నర్ సెంచరీ.. ట్వంటీ-20ల్లో అత్యుత్తమ శతకంగా అభివర్ణించాడు.

వెబ్దునియా పై చదవండి