ఆ జట్టు విజయాలకు ఐపీఎలే కారణం: పీటర్సన్

శనివారం, 14 మార్చి 2009 (10:09 IST)
ఉపఖండపు పిచ్‌లపైనే కాదు.. ఎలాంటి వికెట్లపైనైనా భారత జట్టు.. రాణించగలదని న్యూజిలాండ్ పర్యటనలో నిరూపించింది. అయితే భారత జట్టు విజయాలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీనే కారణమని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ట్వంటీ20 ఫార్మాట్‌లో నిలకడైన ఆటతీరును కనబరచడం వల్ల వన్డే, టెస్ట్ ఫార్మాట్‌లలో ఆడేందుకు ఎంతగానో దోహదపడుతుందని విశ్లేషించాడు. లండన్‌లో విలకురల సమావేశం పీటర్సన్ మాట్లాడుతూ, ఐపీఎల్ టోర్నీలో పాల్గొన్న తర్వాత టీఇండియా బాగా మెరుగుపడిందన్నాడు.

క్రితం సారి తాము భారత్‌లో జరిగిన ఐపీఎల్-1 టోర్నీలో ఆడలేకపోయామని వ్యాఖ్యానించాడు. ఇది తమను చాలా నిరాశకు గురిచేసినట్లు కూడా తెలిపాడు. అయితే ఐపీఎల్-2కు మాత్రం తాము తప్పని సరిగా హాజరవగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి