ఐపీఎల్-3: నేడు బెంగళూరు-రాజస్థాన్‌ల ఢీ..!!

FILE
డీఎల్ఎఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా జరిగే లీగ్ మ్యాచ్‌లో బుధవారంనాడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఢీకొట్టనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న 50వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్, బెంగళూరు జట్లు సెమీ ఫైనల్ బెర్తుకోసం హోరాహోరీ తలపడనున్నాయి.

కాగా.. ఐపీఎల్-3 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు జట్లు సమానంగా చెరో 12 పాయింట్లను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. అయితే నేటి మ్యాచ్‌లో ఏ జట్టయితే విజయం సాధిస్తుందో, ఆ జట్టు పాయింట్లు పెరగటమేగాకుండా, ఐపీఎల్ పట్టికలో రెండో స్థానంలో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లూ హోరాహోరీ పోరాటం కొనసాగించనున్నాయి.

జట్ల వివరాలను చూస్తే..

రాజస్థాన్ రాయల్స్ :
షేన్ వార్న్ (కెప్టెన్), ఎస్ఏ అస్నోడ్కర్, జె. బోథా, ఎస్ త్రివేది, ఎఫ్ ఫజల్, యూసుఫ్ పఠాన్, ఏ ఫించ్, ఏ ఝున్జున్వాలా, కుమరన్ ఖాన్, ఎమ్ లూంబ్, ఎమ్ మోర్కెల్, ఎస్ నార్వల్, ఎన్ ఓజా (వైస్ కెప్టెన్), ఎమ్ పటేల్, ఏ పావునికర్, ఎస్ ఖ్వద్రీ, ఏ రవుత్, ఏ సింగ్, ఎస్ టైట్, ఏ యూనియల్, ఏ వోజెస్, ఎస్ వాగ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :
అనిల్ కుంబ్లే (కెప్టెన్), బి అఖిల్, కేపీ అప్పన్న, ఆర్.వి. ఊతప్ప, ఎమ్.వి బౌచర్, రాహుల్ ద్రవిడ్, ఎస్‌పీ గోస్వామి, జేహెచ్ కలిస్, విరాట్ కోహ్లీ, ఆర్ వినయ్ కుమార్, బీ కుమార్, పి కుమార్, ఏ మిథున్, మోర్గాన్, ఎంకే పాండీ, కేపీ పీటర్సన్, ఎస్‌పీడీ స్మిత్, ఎస్ శ్రీరామ్, డీడబ్ల్యూ స్టెయిన్, ఎల్‌ఆర్‌పీఎల్ టేలర్, డి డు ప్రీజ్, ఆర్ఈ వాన్ డెర్ మెర్వే, సీఎల్ వైట్ తదితరులున్నారు.

వెబ్దునియా పై చదవండి