ఐపీఎల్ వేదిక మార్పు: సచిన్ నిరాశ

ఐపీఎల్ రెండో సీజన్ వేదిక మారడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిరాశ వ్యక్తం చేశాడు. ఐపీఎల్ టోర్నీ విదేశాలకు మారిన కారణంగా మరికొన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండడం ఎవరికైన కష్టమేనని ఈ సందర్భంగా సచిన్ వ్యాఖ్యానించాడు.

ఈ విషయమై సచిన్ మాట్లాడుతూ ఐపీఎల్ వేదిక మారడం తనకు నిరాశ కలిగించిందన్నాడు. అయితే అందరూ టోర్నీ జరగాలనే అనుకుంటున్నారని సచిన్ పేర్కొన్నాడు. మరోవైపు టీం ఇండియా కొద్ది ఏళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తుండడం పట్ల సచిన్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

తన ఇరవై ఏండ్ల కెరీర్‌లో గత మూడు, నాలుగేళ్లు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయని సచిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆస్వాదిస్తున్నంత మజాను ఇంతకుముందు తానెన్నడూ ఆస్వాదించలేదని సచిన్ పేర్కొన్నాడు. టీం ఇండియా అడుగుపెట్టిన ప్రతిచోటా టెస్టు విజయాలు సాధిస్తోందని, అలాగే కివీస్ గడ్డపై టెస్ట్ విజయం సాధించిన జట్టులో తాను, ద్రావిడ్ ఉండడం సంతోషాన్ని కలిగిస్తోందని సచిన్ అన్నాడు.

వెబ్దునియా పై చదవండి