ఐసీఎల్‌కు యూసఫ్ స్వస్తి!?

ఐపీఎల్ తొలి సీజన్‌లో డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ యూసఫ్ ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)కు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు.

యుఎఇలో ఏప్రిల్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌లో పాక్ తరపున ఆడాలని యూసఫ్ భావిస్తున్నాడని పీసీబీ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు యూసుఫ్ తెలియజేశాడని తెలిసింది.

ఇదిలా ఉండగా... గత ఏడాది ఐసీఎల్‌లో పాల్గొనని కారణంగా, అతనిపై పీసీబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి