కివీస్ తొలి వన్డేకు ఇషాంత్ దూరం

శనివారం, 28 ఫిబ్రవరి 2009 (19:33 IST)
టీం ఇండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయం కారణంగా ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టుతో జరిగే తొలి వన్డే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. కివీస్‌తో వెల్లింగ్టన్ వెస్ట్‌ప్యాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్ సందర్భంగా ఇషాంత్ భుజానికి గాయం అయిన సంగతి విదితమే.

ఇషాంత్ భుజానికి గాయమైనట్లు శనివారం నిర్వహించిన ఎంఆర్ఐ స్కాన్‌లోనూ నిర్ధారణ నిర్ధారణ కావడంతో... అతను తొలి వన్డేకు దూరమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో బంతిపై జారిపడటంతో ఇషాంత్ పాతగాయం మళ్లీ తిరగబెట్టడంతో... భుజంలోపల గాయమైనట్లు ఎంఆర్ఐ స్కాన్ వెల్లడించింది.

ఈ విషయమై టీం ఇండియా మేనేజర్ నిరంజన్ షా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఇషాంత్‌ను వచ్చే రెండు రోజులపాటు పరిశీలిస్తామని చెప్పారు. అయితే అతను తొలి వన్డేకు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని షా స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి