సొంత గడ్డపై పటిష్టమైన భారత్ జట్టుతో ఆరంభమైన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుని, భారత్‌ను ఆరంభంలోనే దెబ్బతీసి పట్టు సాధించేందుకే ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించినట్టు కివీస్ కెప్టెన్ వెట్టోరి వెల్లడించారు. కాగా, 47 రోజుల పాటు సాగే సుదీర్ఘ పర్యటనలో ఇరు జట్లు తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో బుధవారం తలపడుతున్నాయి.