నేపియర్‌లో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ పటిష్ట స్థితికి చేరింది. రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేయడం ద్వారా మ్యాచ్‌ను శాసించే స్థాయికి చేరింది. టైలర్ (151), రైడర్ (137 నాటౌట్)లు విజృంభించి సెంచరీలు చేయడంతో కివీస్ జోరుకు బ్రేకులు లేకుండా పోయింది. ప్రస్తుతం రైడర్ (137), ఫ్రాంక్లిన్ (26)లు క్రీజులో ఉన్నారు. తొలిరోజు మ్యాచ్‌లో భారత్ తరపున జహీర్‌ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్‌శర్మ, హర్భజన్‌సింగ్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు ఈ టెస్టులో టాస్ గెలిచిన బ్యాటింగ్ చేపట్టిన కివీస్‌కు ప్రారంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద మెక్లంతోష్ (12)ను ఔట్ చేయడం ద్వారా కివీస్‌ను ఇషాంత్ తొలిదెబ్బ తీశాడు. అటుపై క్రీజులోకి వచ్చిన హౌ (1)ని జహీర్ పెవిలియన్‌కు చేర్చడంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. అటుపై మరో పరుగు జోడించిన దశలో మరో ఓపెనర్ గుప్టిల్ (8)ను సైతం జహీర్ బోల్తా కొట్టించాడు. దీంతో భారత శిబిరంలో నెలకొన్న ఉత్సాహం రెట్టింపైంది.
అయితే భారత ఉత్సాహంపై నీళ్లుజల్లే విధంగా టైలర్‌కు జతకలిసిన రైడర్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. దీంతో వీరిద్దరి జోడిని విడదీయడం భారత్‌కు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ జోడి నాలుగో వికెట్‌కు 271 పరుగులు జోడించడం ద్వారా కివీస్‌ను పటిష్ట స్థితికి చేర్చారు. ఈ దశలో టైలర్ (151)ను హర్భజన్ ఔట్ చేశాడు.