తొలి మ్యాచ్‌లోనే ధోనీసేనకు గట్టి షాక్ తప్పదు..!: ఆఫ్ఘన్ కోచ్

FILE
కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు గట్టి షాక్ ఇస్తామని ఆప్ఘనిస్థాన్ కోచ్ ఖబీర్ ఖాన్ హెచ్చరించాడు. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీం ఇండియాకు ఐసీసీ ట్వంటీ-20 ప్రారంభ మ్యాచ్‌లోనే ఆశ్చర్యకరమైన అంశాలతో షాకిస్తామని ఖబీర్ తెలిపాడు.

శనివారం జరిగే ఐసీసీ ట్వంటీ-20 తొలి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సేన ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. తొలిసారిగా ఐసీసీ ట్వంటీ-20 మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన ఆప్ఘనిస్థాన్‌ జట్టుకు.. టీం ఇండియాపై గట్టిపోటీనిచ్చే సత్తా ఉందని ఖబీర్ అన్నాడు.

ప్రతిభావంతులైన క్రికెటర్లను కలిగిన భారత్ జట్టు గురించి తనకు పూర్తిగా తెలుసునని ఖబీర్ చెప్పాడు. ఇంకా టీం ఇండియా క్రికెటర్ల బలం ఏమిటో? బలహీనతలేంటో? బాగా తెలుసునని ఖబీర్ అన్నాడు. ఇటీవలే ముగిసిసన ఐపీఎల్ మ్యాచ్‌ల ద్వారా టీం ఇండియా ఆటతీరుపై ఓ అంచనాకు వచ్చామని ఆప్ఘన్ కోచ్ వెల్లడించాడు.

ఇంకా చెప్పాలంటే..? భారత్‌కు ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు ఇచ్చే షాక్‌ను ఐసీసీ తొలి మ్యాచ్‌ ముగిసినప్పటికీ ధోనీసేన మరిచిపోదని ఖబీర్ తెలిపాడు. అలాగే.. భారత జట్టుపై వ్యక్తిగతంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఆప్ఘనిస్థాన్ ఆల్-రౌండర్ ఖరీమ్ సద్ధీఖ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి