నేపియర్ టెస్ట్ : టేలర్, రైడర్ సెంచరీలు

టీం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య నేపియర్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్, తొలి ఇన్నింగ్స్‌లో టేలర్, జెస్సీ రైడర్‌లు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కీలకమైన రెండో టెస్ట్‌లో కివీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, టీ విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.

కివీస్ ఓపెనర్ల మకింతోష్ 12, గుప్తిల్ 8, జెమీ హో ఒకే ఒక్క పరుగుతోనే పెవిలియన్ చేరగా, కష్టాల్లో పడ్డ జట్టును టేలర్, జెస్సీ రైడర్‌లు ఆదుకుని స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ నేపథ్యంలో టేలర్ 151, రైడర్ 107 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే... గాయం కారణంగా టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూరమైన సంగతి విదితమే. ఈ మేరకు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేపట్టగా, దినేష్ కార్తీక్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు.

వెబ్దునియా పై చదవండి