ప్రపంచ రికార్డు కోసం ద్రావిడ్ ఎదురుచూపు

టీం ఇండియా బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రావిడ్ ప్రపంచ రికార్డు కోసం ఎదురు చూస్తున్నాడు. నేపియర్‌లో జరుగుతోన్నభారత్ -న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌లో అత్యున్నత టెస్టు క్యాచ్‌లతో ప్రపంచ రికార్డును సాధించే దిశగా రాహుల్ ద్రావిడ్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్క్ వాగ్ సాధించిన టెస్టు వికెట్ల రికార్డు (181 క్యాచ్‌లు)ను బద్దలు కొట్టేందుకు వచ్చిన అవకాశాన్ని రాహుల్ ద్రావిడ్ చేజార్చుకున్నాడు.

నేపియర్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ టైలర్ క్రీజులో ఉండగా, 51వ ఓవర్ వద్ద లభించిన అరుదైన క్యాచ్‌ను రాహుల్ ద్రావిడ్ చేతులారా చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టైలర్, 92వ పరుగుల వద్ద హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో, లభించిన క్యాచ్‌ను రాహుల్ ద్రావిడ్ క్షణిక కాలంలో చేజార్చుకున్నాడు. దీంతో అత్యున్నత వికెట్లను సాధించిన వాగ్ రికార్డును భారతీయ బ్యాట్స్‌మన్ ద్రావిడ్ తిరగరాయలేకపోయాడు.

రెండో టెస్టులో సెంచరీ సాధించిన టైలర్‌ను 151 పరుగుల వద్ద టీం ఇండియా బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ఇంటి ముఖం పట్టించాడు. టైలర్ 151 పరుగులతో కివీస్‌కు 271 పరుగులు జోడించాడు.

ఇదిలా ఉండగా.. నేపియర్‌లో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ పటిష్ట స్థితికి చేరింది. రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది.

వెబ్దునియా పై చదవండి