మే 28 నుంచి జింబాబ్వేలో ముక్కోణపు వన్డే సిరీస్!

FILE
జింబాబ్వేలో వచ్చే నెల మే 28వ తేదీ నుంచి ముక్కోణపు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో భారత్, శ్రీలంక, జింబాబ్వేల మధ్య ముక్కోణపు వన్డే సమరం ఉంటుంది.

ఏడు రోజుల పాటు జరిగే ఈ సిరీస్‌కు అనంతరం భారత్-జింబాబ్వేల మధ్య రెండు ట్వంటీ-20 అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలు జరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది.

జింబాబ్వే గడ్డపై జరిగే ఈ సిరీస్‌లో ఆడేందుకు భారత క్రికెట్ జట్టు టీం ఇండియా వచ్చే నెలాఖరున ఆ దేశానికి ప్రయాణం కానుందని బీసీసీఐ తెలిపింది.

మే 28వ తేదీన జరిగే తొలి మ్యాచ్‌లో భారత్.. ఆతిథ్య జట్టు జింబాబ్వేతో తలపడుతుంది. అలాగే మే 28 నుంచి జూన్ 13వ తేదీ వరకు ఈ సిరీస్‌లో మే 30 తేదీన శ్రీలంకతోనూ, జూన్ మూడో తేదీన జింబాబ్వేతోనూ, జూన్ 12, 13 తేదీల్లో జింబాబ్వేలతో రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లను భారత్ ఆడుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. స్వదేశంలో గత ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. జింబాబ్వేలో జరిగే ముక్కోణపు సిరీస్‌లోనూ ధీటుగా రాణించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి