వన్డే జట్టుకు ఎంపికైన గ్రేమ్ స్మిత్‌

ఆఖరి టెస్ట్‌లో లభించిన విజయంతో ఊపిరి పీల్చుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు మరో పెద్ద ఊరట కలిగించే అంశం చేకూరింది. గాయం కారణంగా జట్టు సేవలకు దూరమైన కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వన్డే జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో త్వరలో ఆస్ట్రేలియా జట్టుతో జరుగనున్న వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో స్మిత్‌కు చోటు కల్పించారు.

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-2 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ సిరీస్ తర్వాత సొంత గడ్డపై జరిగే ఛాపంయిన్ ట్రోఫీ, ఇంగ్లండ్‌లో జరిగే ట్వంటీ-20 ప్రపంచ కప్‌, జింబాబ్వేతో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్ ఇలా పలు అంతర్జాతీయ షెడ్యూల్స్‌ కారణంగా దక్షిణాఫ్రికా జట్టు బిజిబిజీగా గడుపనుంది. ఈ నేపథ్యంలో గాయం నుంచి కోలుకున్న స్మిత్ జట్టు సేవలకు అందుబాటులోకి రావడం ఆ జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

తొలి రెండు వన్డేలకు జట్టు వివరాలు.. గ్రేమ్ స్మిత్ (కెప్టెన్), గిబ్స్, ఆమ్లా, డీ విలియర్స్, జాక్వెస్ కల్లీస్, డుమ్నీ, వాఘన్ వాన్, మార్క్ బౌచర్ (వికెట్ కీపర్), అల్బియా మోర్కెల్, జాన్ బోథా, డేలే స్టేన్, వేన్ పార్నెల్, ముఖయా ఎన్తిని.

వెబ్దునియా పై చదవండి