వారిద్దరి కోసం టెస్ట్ సిరీస్ గెలుస్తాం: ధోనీ

'టీమ్ ఇండియా' బ్యాటింగ్‌కు వెన్నెముకగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మిస్టర్ కూల్ రాహుల్ ద్రావిడ్‌ల కోసం న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను నెగ్గుతామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. ఈ టెస్ట్‌ సిరీస్‌ను నెగ్గి వారిద్దరికి కానుకగా ఇస్తామని ప్రకటించారు.

మొదటి టెస్ట్‌ను నెగ్గి సిరీస్‌లో తొలి మైలురాయిని అధిగమించామని ధోనీ అన్నాడు. మిగిలిన రెండు టెస్టుల్లోనూ ఇదే తరహాలో రాణించడం చాలా ముఖ్యం. సిరీస్‌ను కైవసం చేసుకుని జట్టు తరపున సచిన్‌, ద్రావిడ్‌కు కానుకగా ఇస్తాం. మా జట్టు పటిష్టంగాగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు సమర్థవంతంగా తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా, డ్రెస్సింగ్‌ రూం‌లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంలో సఫలీకృతులమయ్యాం అని ధోనీ వివరించాడు.

ప్రతి ఒక్కరూ సౌకర్యంగా ఉన్నామని భావించేలా మంచి వాతావరణం, ఉన్నత స్థాయిలో వసతులు కల్పిస్తున్నాం. అందువల్ల, కొంతకాలం నుంచి మేం నిలకడగా రాణిస్తూ విజయాలు సాధిస్తున్నాం. ఈ టెస్టులో సచిన్‌, భజ్జీ అద్భుతంగా ఆడారని ధోనీ ప్రశంసించాడు. కాగా, తొలి టెస్టులో లభించిన విజంయ బౌలర్లు, సచిన్‌స ప్రతిభే కారణమన్నారు.

వెబ్దునియా పై చదవండి