తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటపల్లి తాండాకు చెందిన జయపాల్ నాయక్ (19) ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట రాజంపేట మన్నూరులో ఉంటూ మోటార్లకు మరమ్మతులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అతనికి వజ్రకరూరుకు మండలానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నారు. అయితే, కొన్ని రోజులుగా ఆమె మాట్లాడట్లేదు. పలుమార్లు ఫోన్ చేసినా ఆమె వైపు నుంచి స్పంద లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, మన్నూరులో నివాసం ఉంటున్న ఓ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన మన్నూరు పోలీసులు శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.