వీరేంద్ర సెహ్వాగ్‌ ఎన్.ఓ.సిని వెనక్కి తీసుకున్న బీసీసీఐ!

FILE
విదేశీ కౌంటీల్లో ఆడేందుకు అనుమతినిస్తూ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్.ఓ.సి)ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా వెనక్కి తీసుకుంది. ఈ యేడాది తీరికలేని షెడ్యూల్ ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ఇంగ్లండ్‌కు చెందిన నార్తంప్టన్‌షైర్ జట్టు తరపున కౌంటీ క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇస్తూ సెహ్వాగ్‌కు ఎన్.ఓ.సి సర్టిఫికేట్‌ను బీసీసీఐ కొద్ది రోజుల క్రితం అందజేసింది. ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌ను సాకుగా చూపి వెనక్కి తీసుకోవడం గమనార్హం. దీనిపై నార్తాంప్ట్‌షైర్ క్లబ్ ఒక ప్రకటన విడుదల చేసింది.

కౌంటీ ట్వంటీ-20 క్రికెట్‌లో సెహ్వాగ్ ఆడటం ఖాయమని అనుకుంటున్న తరుణంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసిందని పేర్కొంది. ఒక్క సెహ్వాగ్‌కు మాత్రమే కాకుండా, భారత క్రికెటర్లందరికీ మంజూరు చేసిన ఎన్.ఓ.సిని రద్దు చేయడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి