స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా మూడు, నాలుగు వన్డేల కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఇందులో బార్బడోస్ బ్యాట్స్‌మెన్ డాలే రిచర్డ్స్, ట్రినిడాన్ ఫాస్ట్‌బౌలర్ రవి రాంపాల్లకు చోటు కల్పించింది.
డెవన్ స్మిత్ స్థానంలో రిచర్డ్స్‌ను జట్టులోకి తీసుకున్నాడు. తొలి రెండు వన్డేలకు స్మిత్ ఎంపికైనప్పటికీ డ్రెస్సింగ్ రూంకే పరిమితం అయ్యాడు. అలాగే, తొలి టెస్టులో చోటు దక్కినప్పటికీ, కాలి గాయం కారణంగా మైదానంలోకి దిగలేక పోయాడు. ఇకపోతే రాంపాల్‌కు డరేన్ పావెల్ స్థానంలో చోటు కల్పించారు.
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. అలాగే తొలి వన్డేలో చోటు దక్కినప్పటికీ ఐదు ఓవర్లు వేసి 27 పరుగులు సమర్పించి ఒక వికెట్ తీశాడు. 30 వన్డేలు ఆడిన రాంపాల్, గత 2008లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన వెస్టిండీస్ జట్టులో స్థానం పొందాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. మూడో వన్డే 27వ తేదీన జరుగుతుంది.