ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే టోర్నీ యాషెస్ సిరీస్. ఈ టోర్నీ టైటిల్‌ను ఇంగ్లాండ్ జట్టు గెలుచుకున్న సందర్భాలు చాలా తక్కువ. గత 1986-87 సంవత్సరంలో మైక్ గ్యాటింగ్ కెప్టెన్సీలో ఒకసారి ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఆ తర్వాత 2005 సంవత్సరం సెప్టెంబరు 12వ తేదీన మైకేల్ వాన్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్‌ను రెండో సారి కైవసం చేసుకుంది. ఈ ట్రోఫీ విజయంతో కెప్టెన్ మైకేల్ వాన్ పేరును ఇంగ్లీష్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారు. ఎపుడూ ప్రశాంత వదనంతో కనిపించే వాన్.. క్రీడా ప్రొఫైల్‌ను ఒకసారి పరిశీలిస్తే...
పూర్తి పేరు.. మైఖేల్ పాల్ వాన్ పుట్టిన తేది.. 1974, అక్టోబరు 29, మాంచెస్టర్ ప్రధాన జట్లు.. ఇంగ్లాండ్, యార్క్‌షైర్ నిక్ నేమ్.. విర్గిల్, ఫ్రెంకీ బ్యాటింగ్ స్టైల్.. రైట్ హ్యాండెడ్ బౌలింగ్ స్టైల్.. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ మొత్తం ఆడిన టెస్టులు.. 76 చేసిన పరుగులు.. 5479 సెంచరీలు.. 17, అర్థ సెంచరీలు.. 18 ఆడిన వన్డేలు.. 86 మొత్తం పరుగులు.. 1982 అర్థ సెంచరీలు 16 తొలి టెస్టు మ్యాచ్.. 1999, నవంబరు 25-28, ప్రత్యర్థి.. దక్షిణాఫ్రికా జట్టు. తొలి వన్డే మ్యాచ్.. 2001, మార్చి 23, ప్రత్యర్థి శ్రీలంక.