దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు అతి చిన్న వయస్సులో నాయకత్వ బాధ్యతలను స్వీకరించిన క్రికెటర్‌గా గ్రేమ్ స్మిత్ రికార్డు సృష్టించాడు. జట్టు కష్ట కాలంలో ఉన్న సమయంలో జట్టును ఆదుకునే క్రికెటర్ కోసం ఆదేశ క్రికెట్ బోర్డు నిశితంగా అన్వేషించింది. ఇలాంటి తరుణంలో బోర్డు దృష్టిలో కనిపించిన ఆటగాడు స్మిత్. గత 2003 సంవత్సరం మార్చి నెలలో స్మిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. జట్టులో జాంటీ రోడ్స్, షాన్ పొలాక్ వంటి ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ గ్రేమ్ స్మిత్‌కే బోర్డు పట్టం కట్టింది.
2003లో దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్ పర్యటన సమయంలో రెండు డబుల్ సెంచరీలు చేసి తన సత్తాను చాటాడు. అయితే స్మిత్ టెస్ట్ అరంగేట్రం ఆలస్యమైంది. సెలక్టర్లు అష్వాల్ ప్రిన్స్‌పైపు మొగ్గు చూపి, స్మిత్‌కు మొండి చేయి చూపారు. దీంతో 2001-02లోనే టెస్టుల్లో ప్రవేశం చేయాల్సిన స్మిత్, 2003 ఇంగ్లాండ్ పర్యటనలో ఆ కోరికను తీర్చుకున్నాడు. ఆ తర్వాత 2003లో జరిగిన ప్రపంచ కప్‌లో కూడా స్మిత్ ఆలస్యంగా జట్టులో చోటు దక్కింది. రోడ్స్ గాయంతో స్మిత్‌కు చోటు దక్కింది.
పూర్తి పేరు.. గ్రేమ్ గ్రెగ్ స్మిత్ పుట్టిన తేది.. 1981, ఫిబ్రవరి 1. ప్రస్తుత వయస్సు.. 27 సంవత్సరాలు. ప్రధాన జట్లు.. దక్షిణాఫ్రికా, ఆఫ్రికా XI, కేప్ కోబ్రాస్, హ్యాంప్ షైర్ క్రికెట్ బోర్డు. ఐసిసి వరల్డ్-XI, రాజస్థాన్ రాయల్స్, సోమర్సెట్, వెస్ట్రన్ ప్రొవియన్స్. బ్యాటింగ్ స్టైల్.. ఎడమచేతి వాటం. బౌలింగ్ స్టైల్.. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్.
టెస్టులు.. 66, చేసిన పరుగులు.. 5392, అత్యధిక స్కోరు.. 277, సెంచరీలు.. 14, అర్థ సెంచరీలు.. 22. వన్డేలు.. 133, చేసిన పరుగులు.. 5016. అత్యధిక స్కోరు.. 134*, సెంచరీలు.. 7, అర్థ సెంచరీలు.. 36. (నోట్: 14, జూలై 2008 నాటికి స్మిత్ వ్యక్తిగత గణాంకాలు)