ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును వరుసగా రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిపిన కెప్టెన్ రికీ పాంటింగ్. క్రికెట్ ప్రపంచంలో ఉన్న కెప్టెన్‌లలో అత్యుత్తమ కెప్టెన్‌గా పేరుగడించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయాల్లో జట్టును ముందుండి నడిపించగల సత్తా కలిగిన రికీ.. జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తాడు. నేటి ఆధునిక క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్‌లలో ఒకరైన రికీ పాంటింగ్ ప్రొఫైల్ పరిశీలిద్దాం.
పూర్తి పేరు.. రికీ థామస్ పాంటింగ్ పుట్టిన తేది.. డిసెంబరు 19, 1974. ప్రస్తుత వయస్సు.. 33 సంవత్సరాల 180 రోజులు ప్రధానంగా ఆడే జట్లు.. ఆస్ట్రేలియా, ఐసిసి ప్రపంచ XI, కోల్‌కతా నైట్ రైడర్స్, టాస్మానియా, సోమర్సెట్. నిక్ నేమ్.. పాంటర్. జట్టులో స్థానం.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్
బ్యాటింగ్ శైలి.. కుడి చేతి వాటం బౌలింగ్ శైలి.. రైట్ ఆర్మ్ మీడియం ఎత్తు.. 1.78 మీటర్లు. ఆడిన టెస్టులు.. 118, ఇన్నింగ్స్.. 197, చేసిన పరుగులు.. 10,042, సెంచరీలు.. 35, అర్థశతకాలు.. 40. ఆడిన వన్డేలు.. 298, ఇన్నింగ్స్.. 289, చేసిన పరుగులు..11,026, సెంచరీలు.. 26, అర్థ సెంచరీలు.. 63. ట్వంటీ-20 మ్యాచ్‌లు.. 10, ఇన్నింగ్స్.. 10, చేసిన పరుగులు.. 315. (నోట్:- పై గణాంకాలు 2008, జూన్ 16వ తేదీ వరకు మాత్రమే).