కష్టాల్లో ఆసీస్ : బ్యాట్స్‌మెన్ల తడబాటు

శుక్రవారం, 30 జనవరి 2009 (16:16 IST)
దక్షిణాఫ్రికా విధించిన 289 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా 23 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్ మార్స్ కేవలం 5 పరుగులు చేసి ఆమ్లాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ అత్యధికంగా 22 పరుగులు చేసి రనౌట్‌తో పెవిలియన్ చేరాడు.

ఆ తరువాత వచ్చిన కెప్టెన్ రికీ పాంటింగ్ సోట్సోబే బౌలింగ్‌లో విలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా, క్లార్క్ పరుగులేమీ చేయకుండానే మోర్కెల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ప్రస్తుతం మెక్ హస్సీ (25), డీజే హస్సీ(15) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో సోట్సోబే ఏడు ఓవర్లకుగానూ రెండు వికెట్లు పడగొట్టగా... మోర్కెలో ఆరు ఓవర్లలో ఒక వికెట్ తీసుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో దాదాపు సగం ఓవర్లు ఆడిన ఆసీస్... కనీసం 100 పరుగుల మార్కు కూడా దాటలేక ఏటికి ఎదురీదుతోంది. ఇప్పటికే నాలుగు వికెట్లు పోగొట్టున్న ఆసీస్ దక్షిణాఫ్రికా విధించిన భారీ లక్ష్యాన్ని అధిగమించాలంటే చాలానే కష్టపడాల్సి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి