నాలుగో టెస్ట్: సెహ్వాగ్ అర్థ సెంచరీ

నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో భారత్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అర్థ సెంచరీతో రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఓపెనర్ విజయ్ 33 పరుగులతో ఆకట్టుకుని, వాట్సన్ బౌలింగ్‌లో హ్యాడ్డిన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ ద్రావిడ్ క్రెజా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ ఒక్క పరుగు తేడాతో రెండు వికెట్లను కోల్పోయింది. అనంతరం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రీజ్‌లోకి వచ్చాడు. కాగా, మరో ఓపెనర్ సెహ్వాగ్ మరోమారు రాణించాడు. 62 బంతుల్లో తొమ్మిది ఫోర్లతో 65 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో వాట్సన్, క్రెజాలు ఒక్కో వికెట్ తీశారు.

వెబ్దునియా పై చదవండి