రాజ్‌కోట్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు విజృంభించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు సెహ్వాగ్, గంభీర్ అర్థశతకాలతో భారత్‌కు శుభారంభం చేశారు.
అనంతరం బరిలోకి దిగిన రైనా అర్థశతకాన్ని చేజార్చుకున్నప్పటికీ 43 పరుగులు చేశాడు. మొత్తానికి ముగ్గురు భారత్ ఆటగాళ్లు అర్థశతకాన్ని నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా... ఫోర్ల మోతతో భారత్‌కు భారీ స్కోరును సంపాదించి పెట్టారు.
ఇందులో భాగంగా.... వీరూ.. పది ఫోర్లు, గంభీర్ 8, యువరాజ్ సింగ్ 16 ఫోర్లు, ఇషాంత్ శర్మ (1), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండు ఫోర్లు కొట్టారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ 39 పరుగులకే హార్మిసన్ బౌలింగ్‌తో ఇంటి ముఖం పట్టాడు.
నడుంనొప్పితో బరిలోకి దిగిన యువరాజ్ సింగ్ భారత్ జట్టుకు భారీ స్కోరును సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. పఠాన్, ధోనీ, ఇషాంత్ శర్మల భాగస్వామ్యంతో ఏకధాటిగా శతకం దాటాడు. మొత్తానికి 78 బంతుల్లోనే, 16 ఫోర్లతో 138 పరుగులు చేశాడు. మొత్తానికి నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల పతనానికి భారత్ 387 పరుగులు చేసింది.
భారత్ ఆటగాళ్లలో గంభీర్ (51 పరుగులు), సెహ్వాగ్ (85), సురేష్ రైనా (43), ధోనీ (39), ఇషాంత్ శర్మ (11) పరుగులు చేశారు. 138 పరుగులతో శతకం దాటిన యువరాజ్ సింగ్, శర్మలు నాటౌట్‌గా నిలిచారు. యూసఫ్ పఠాన్ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. దీనితో ఇంగ్లండ్ విజయలక్ష్యంగా భారత్ 387 పరుగులను నిర్దేశించింది.
ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్లింటాఫ్ ఒకటి, ఎస్.జె. హార్మిసన్ రెండు వికెట్లు, ఎస్.ఆర్. పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు.