మైదానంలోనూ, నిజజీవితంలోనూ టీమిండియా ప్లేయర్ యువరాజ్ సింగ్ ఎదుర్కొన్న పరిస్థితులను తల్చుకుంటే తన మనస్సు చలించిపోతుందని భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి భారిన పడి కూడా మృత్యువుతో పోరాడి జయించివచ్చిన యువరాజ్ సింగ్ చాంపియన్‌షిప్ ట్రోఫీలో బంగ్లాజట్టు మ్యాచ్‌తో జరిగిన సెమీఫైనల్ యువరాజ్ సింగ్‌కి కెరీర్లో 300 మ్యాచ్. కానీ రోహిత్, ధాపన్, కోహ్లీ విజృంభణతో యువీ ఈ కీలకమ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దూరమయ్యాడు.
భారత బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ 300 మ్యాచ్ సందర్భంగా సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘యువీ ఈ 300 మ్యాచ్‌లు ఆడే క్రమంలో ఎన్నో అడ్డంకులను, సవాళ్లను పట్టుదలతో అధిగమించాడు. యువీ ఎదుర్కొన్న పరిస్థితులు తలుచుకుంటే నా మనసు ద్రవిస్తుంది’ అని సచిన్ అన్నారు. జీవితంలో ప్రతీ సందర్భంలోనూ తన ప్రత్యేకత చాటుకుంటూ ఈ స్థితికి చేరుకున్నాడు. ఇకముందు కూడా అలాంటి తపనతోనే అతడు దేశానికి, భారత జట్టుకు మరిన్ని విజయాలు అందిస్తాడన్న నమ్మకం ఉంది అంటూ సచిన్ ట్వీట్ చేశారు.