టీం ఇండియా-శ్రీలంక జట్ల మధ్య ప్రేమదాస స్డేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో... భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీంఇండియా, లంకకు 257 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (42), సచిన్ టెండూల్కర్ (6) పరుగులతో పెవిలియన్ చేరగా... తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ గౌతం గంభీర్ (27), యువరాజ్ (66), సురేష్ రైనా (29), యూసుఫ్ పటాన్ (21) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (23), కుమార్ (15), జహీర్ (17) పరుగులు సాధించి వెనుదిరిగారు. చివరిగా ఓజా మాత్రం పరుగులేమీ చేయకుండా క్రీజ్‌లో మిగిలాడు.
శ్రీలంక బౌలర్లలో కులశేఖర్, మహరూఫ్, అజంతా మెండీస్‌లు తలా రేండేసి వికెట్లు పడగొట్టగా... దిల్షాన్ ఒక వికెట్ సాధించాడు. భారత బ్యాట్స్‌మెన్‌లలో అత్యధికంగా యువరాజ్ సింగ్ 66 పరుగులు, అత్యల్పంగా సచిన్ టెండూల్కర్ 6 పరుగులు చేయగా... అసలు పరుగులేమీ చేయకుండా ఓజా క్రీజ్‌లో మిగిలాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నన టీం ఇండియా తొలి 20.3 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసి కష్టాల్లో పడిపోయింది. ఫేవరేట్‌గా బరిలో దిగిన మాస్టర్ బ్లాస్టర్ తొలివన్డేలో మాదిరిగానే, రెండో వన్డేలో కూడా ఎల్బీడబ్ల్యూతో వెనుదిరిగి, అభిమానులను తీవ్ర నిరాశలో ముంచెత్తాడు. అయినప్పటికీ, ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు నిలకడగా ఆడి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరును సంపాదించి పెట్టారు.