మొహాలీ టెస్టు: ఇంగ్లండ్ విజయలక్ష్యం 403

మొహాలీలో జరుగుతున్న రెండో టెస్టు‌లో ఇంగ్లండ్ ముంగిట 403 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ఉంచింది. భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి‌ ఇన్నింగ్స్‌లో లభించిన 152 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని మొత్తం 402 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. భారత జట్టులో ఓపెనర్ గౌతం గంభీర్ (97), యువరాజ్ సింగ్ (86) పరుగులతో రాణించడంతో భారత్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ అచితూచి ఆడుతూ, డ్రా కోసం ప్రయత్నిస్తోంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 453 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 302 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టులో గంభీర్ (179), రాహుల్ ద్రావిడ్ (136), ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ పీటర్సన్ (144) సెంచరీలు చేశారు.

వెబ్దునియా పై చదవండి