బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత టెస్టు చరిత్రలో ఇంతమున్నెన్నడూ లేని విధంగా ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. ముగిసిన ప్రపంచ కప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ను కేవలం మూడు రోజుల్లోనే భారత్ ఆటగాళ్లు ముగించడం విశేషం.
దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్‌కు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును జహీర్ ఖాన్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్‌కు చెందిన నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిన విషయం తెల్సిందే.