మైదానంలో ధోనీ సలహాలు టీమిండియాకు, వ్యక్తిగతంగా తనకూ ఎప్పటికీ విలువైనవే అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అనుభవజ్ఞుడైన ధోనీ వంటి వ్యక్తి సలహాలు వెలకట్టలేనివని, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా తన సూచనలు జట్టుకు ఉపయోగపడతాయని కోహ్లీ ప్రశంసించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధోనీ గురించి ప్రస్తావించాడు.
ధోనీ లాంటి అనుభవమున్న వ్యక్తి సలహాలు వెలకట్టలేనివని చెప్పాడు. మహీ సుచనలు ఏ పరిస్థితుల్లోనైనా ఉపయోగపడతాయని అన్నాడు. సఫారీలను చిత్తుగా ఓడించి టీమిండియా సెమీఫైనల్ చేరిన సమయంలో కూడా ధోనీ క్యాచ్‍లు, రనౌట్లతో ప్రత్యర్థి జట్టును భయకంపితులను చేశాడు.
భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారని, సౌతాఫ్రికా జట్టుపై వాళ్లు కలగజేసిన ఒత్తిడి కారణంగా తాము పైచేయి సాధించగలిగామని కూడా కోహ్లీ చెప్పాడు. ఈ విజయంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాను 2000, 2002, 2013, 2017లో ఓడించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది.